'ఖిలాడి' నుంచి నాలుగో సింగిల్ సిద్ధం!

'ఖిలాడి' నుంచి నాలుగో సింగిల్ సిద్ధం!
  • 'ఖిలాడి'గా రవితేజ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • మూడు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్
  • ఈ నెల 26న 4వ సింగిల్
  • వచ్చేనెల 11న సినిమా రిలీజ్  
రవితేజ ఈ ఏడాది తన దూకుడు చూపించడానికి రెడీ అవుతున్నాడు. చాలా తక్కువ గ్యాప్ లోనే ఆయన నుంచి వరుస సినిమాలు రానున్నాయి. ఈ ఏడాది ఆయన నుంచి తొలి సినిమాగా 'ఖిలాడి' రానుంది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ మూడు సింగిల్స్ ను బయటికి వదలగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ నెల 26వ తేదీన 4వ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ చూస్తే, రవితేజ మరింత ఎనర్జీతో .. మరింత స్టైల్ గా కనిపిస్తున్నాడు. కరోనా తీవ్రత పెద్దగా లేకపోతే ముందుగా చెప్పిన రోజునే ఈ సినిమా థియేటర్లకు వస్తుంది.


More Telugu News