లైకా ప్రొడక్షన్స్ లో బన్నీ సినిమా!

  • ఆమధ్య 'రోబో 2.0'ను నిర్మించిన సంస్థ
  • కమల్ తో 'ఇండియన్ 2' నిర్మాణం 
  • పాన్ ఇండియా స్థాయిలో బన్నీతో 
అటు నార్త్ లోను .. ఇటు సౌత్ లోను భారీ నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్ కి మంచి పేరు ఉంది. లైకా బ్యానర్లో సినిమా అంటే ఎంత భారీతనం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఆమధ్య 'రోబో 2.0' ను ప్రేక్షకులముందుకు తీసుకు వచ్చింది .. ప్రస్తుతం కమల్ - శంకర్ కాంబినేషన్లో 'ఇండియన్ 2' సినిమా నిర్మిస్తున్నది ఈ సంస్థనే.

భారీ ప్రాజెక్టులను మాత్రమే చేపట్టే ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా తమిళ వెర్షన్ ను విడుదల చేసింది లైకావారే.

ఇటు తమిళ .. మలయాళ భాషల్లోను .. అటు హిందీలోను 'పుష్ప' భారీ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ .. మార్కెట్ ఉందని గ్రహించిన లైకా వారు, ఆయనతో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.


More Telugu News