మార్చి 11 నాటికి కరోనా ‘ఎండెమిక్’ అయిపోవచ్చు: ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్
- మరో కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతేనే
- డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేయాల్సి ఉంటుంది
- ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సమీరన్ పాండా
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేస్తున్నారు.
‘‘మన ఆయుధాలు విడవకుండా ఇదే మాదిరి పోరాటం కొనసాగిస్తే.. ఎటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ ఎండెమిక్ (సాధారణ ఫ్లూ)గా మారిపోతుంది. డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేసి, అప్పుడు మరో కొత్త రకం రాకపోతే కరోనా ఎండెమిక్ గా మారిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మా లెక్కల ప్రకారం కరోనా ఒమిక్రాన్ (డిసెంబర్ 11 మొదలు) మూడు నెలల పాటు ఉంటుంది’’ అని పాండే చెప్పారు.
మార్చి 11 నుంచి కరోనా ఒమిక్రాన్ విషయంలో ఉపశమనాన్ని చూస్తామన్నారు. ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు పతాక స్థాయికి చేరాయా? లేదా అన్నదానికి మరో రెండు వారాల పాటు వేచి చూడాలని చెప్పారు. కరోనా విపత్తు స్థాయి రాష్ట్రాల మధ్య వేర్వేరుగా ఉందన్నారు.