నిన్న ఒక్కరోజే దేశంలో 20 శాతం పెరిగిన కరోనా కేసులు.. సగం మంది టీనేజర్లకు మొదటి డోస్ టీకా
- నిన్న 2,82,970 మందికి కరోనా
- అంతకుముందు రోజుతో పోలిస్తే 44,952 కేసులు అధికం
- రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం
- 8,961కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
- టీకాల్లో యువ భారత్ మార్గదర్శనం చేస్తోందన్న ప్రధాని
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువైపోతోంది. నిన్న ఒక్కరోజే 2,82,970 మంది మహమ్మారి బారిన పడ్డారు. అంతకుముందు రోజు 2,38,018 మందికి కరోనా సోకగా.. తాజా కేసుల్లో దాదాపు 20 శాతం పెరుగుదల నమోదైంది. మొన్నటి కన్నా 44,952 కేసులు ఎక్కువగా వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కి పెరిగింది. నిన్న పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. అంతకుముందు రోజు అది 14.45 శాతంగా ఉంది.
ఇక నిన్న కరోనాతో 441 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 4,87,202కి చేరింది. యాక్టివ్ కేసులూ 18.31 లక్షలకు పెరిగాయి. ఇది 232 రోజుల గరిష్ఠం కావడం గమనార్హం. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 4.83 శాతం. అలాగే, పాజిటివిటీ రేటు కూడా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3,55,83,039 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.88 శాతంగా ఉంది.
కరోనాతో పాటే ఒమిక్రాన్ కేసులూ పెరుగుతున్నాయి. కొత్తగా 70 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి పెరిగాయి. ఇప్పటిదాకా 158.88 కోట్ల వ్యాక్సిన్ డోసులు జనానికి వేశారు.
కాగా, దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం వేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా దేశంలో ఉన్న సగం మంది టీనేజర్లకు తొలి డోసు టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకోవాలన్న యువత ఉత్సాహం.. దేశమంతటికీ ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు.
టీనేజర్లకు టీకాలు సగం మందికి అందడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వ్యాక్సినేషన్ విషయంలో యువ భారత్ మార్గదర్శనం చేస్తోందని ఆయన ప్రశంసించారు. సగం మంది టీనేజర్లకు టీకాలు వేశారన్నది శుభవార్త అని అన్నారు. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకుపోవాలని ఆయన సూచించారు. టీకాలు వేసుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి మహమ్మారిపై పోరాడుదామని పిలుపునిచ్చారు.