తండ్రీ కొడుకులిద్దరూ బంగారాలే: కృతిశెట్టి
- భారీ వసూళ్లను రాబడుతున్న 'బంగార్రాజు'
- నిన్న రాజమండ్రిలో 'బ్లాక్ బస్టర్ మీట్'
- అభిమానులను ఆకట్టుకున్న కృతిశెట్టి
- నాగ్ .. చైతూలపై ప్రశంసలు
నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్లో 'బంగార్రాజు' చిత్రం తెరకెక్కింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ వసూళ్లతో సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా 'బ్లాక్ బస్టర్ మీట్'ను రాజమండ్రిలోని 'మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్'లో నిర్వహించారు.
ఈ వేదికపై కథానాయిక కృతిశెట్టి మాట్లాడుతూ .. 'బంగార్రాజు' పేరు వినగానే నాగార్జున - చైతూ గుర్తుకు వస్తారు. రియల్ లైఫ్ లోనూ వాళ్లిద్దరూ బంగారాలే. నాగ్ సార్ ను చూడగానే చాలా రాయల్ గా కనిపిస్తారు. ఇక చైతూ చాలా స్వీట్ హార్ట్ .. ఆయనతో కలిసి నటించే అవకాశం లభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నేను మంచి సర్పంచ్ ను కనుక, నా పాత్రకి లభిస్తున్న క్రెడిట్ ను కల్యాణ్ కృష్ణ గారికి ఇస్తున్నాను. ఆయన మామూలు మంచి దర్శకుడు కాదు .. చాలా మంచి దర్శకుడు అంటూ సినిమాలో తన డైలాగ్ తరహాలో చెప్పింది. 'రాజమండ్రితో నాకు చాలా అనుబంధం ఉంది .. 'ఉప్పెన' సినిమా సమయంలో ఇక్కడ చాలా రోజులు ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.