గుజరాత్‌లో కొవిడ్ నిబంధనలను గంగలో కలిపేసిన బీజేపీ నేత.. పెళ్లికి వేలాదిమంది హాజరు!

  • గుజరాత్‌లో కఠినంగా కరోనా ఆంక్షలు
  • బీజేపీ నేత ఇంట జరిగిన పెళ్లిలో కొవిడ్ ఆంక్షలు బేఖాతరు
  • 150 మంది హాజరు కావాల్సిన పెళ్లిలో వేలాదిమంది
కరోనా వైరస్ మరోమారు పగబట్టిన వేళ రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాయి. శుభకార్యాలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి వాటిపై ఆంక్షలు విధిస్తున్నాయి. పెళ్లిళ్లు వంటి వాటిని అతి తక్కువమంది అతిథులతో జరుపుకోవాలని ఆంక్షలు విధించాయి.

ఇక గుజరాత్ ప్రభుత్వం అయితే వివాహానికి 150 మందికి మించి హాజరు కావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, సాక్షాత్తూ అధికార బీజేపీ నేత ఒకరు ఆ ఆదేశాలను ఉల్లంఘించారు. వారు నిర్వహించిన పెళ్లికి వేలాదిమంది హాజరై డీజేలో రెచ్చిపోయి చిందులేశారు.

తాపి జిల్లాలో బీజేపీ నేత ఇంట సోమవారం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. జిల్లాలోని డోల్వాన్ బ్లాక్‌కు చెందిన బీజేపీ నేత, డోల్వాన్ తహసీల్ ఉపాధ్యక్షురాలు సునంద ఇంట జరిగిన వివాహానికి వేలాదిమంది తరలివచ్చారు. వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేకు అనుగుణంగా చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తుండడంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News