వివేకానందరెడ్డి హత్యకేసు.. ఉమాశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణ వాయిదా
- వివేకా హత్యకేసులో ఉమాశంకర్‌రెడ్డి మూడో నిందితుడు
- కోర్టు రికార్డుల్లో చేరని సీబీఐ కౌంటర్ కాపీ
- దేవిరెడ్డి బెయిలు పిటిషన్ ఇప్పటికే కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ నిన్న ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ దీనిపై కౌంటర్ దాఖలు చేసినట్టు చెప్పారు. అయితే, సంబంధిత కాపీ కోర్టు రికార్డుల్లో లేకపోవడంతో విచారణను కోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్యాప్తు కీలక దశలో ఉన్నట్టు చెప్పారు. మరోవైపు, పిటిషనర్ తరపు న్యాయవాది పి.చిదంబరం మాట్లాడుతూ.. పిటిషనర్ చాలా కాలంగా జైలులోనే ఉన్నారని, దర్యాప్తు ఇప్పటికే పూర్తి కావడంతో బెయిలు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో గజ్జల ఉమాశంకర్‌రెడ్డి మూడో నిందితుడు కాగా, ఐదో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ను కోర్టు ఇటీవల కొట్టివేసింది.