టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: భారత్ బయోటెక్

  • భారత్ లో 15-18 ఏళ్ల వయసుల వారికి వ్యాక్సిన్లు
  • అనుమతుల్లేని వ్యాక్సిన్లు వేస్తున్నారన్న భారత్ బయోటెక్
  • టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే వేయాలని వెల్లడి
దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారికి కరోనా వ్యాక్సిన్లు ఇస్తుండడం తెలిసిందే. అయితే, కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ ఆసక్తికర ప్రకటన చేసింది. టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి అనుమతుల్లేని వ్యాక్సిన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. టీనేజర్లకు కచ్చితంగా కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ ను అనేక దశల్లో పరీక్షించి, 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి అత్యంత సురక్షితమైనదని నిర్ధారించామని భారత్ బయోటెక్ వివరించింది. భారత్ లో చిన్నారులకు ఇవ్వడానికి అనుమతి లభించిన వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఒక్కటేనని వెల్లడించింది.


More Telugu News