తమిళనాడు గవర్నర్ ను కలిసిన చినజీయర్ స్వామి

  • రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన చినజీయర్
  • ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది ఉత్సవాలు
  • 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని చినజీయర్ స్వామి కలిశారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తూ గవర్నర్ కు ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. శంషాబాద్ ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది (1000వ జయంతి) ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 14న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హాజరుకానున్నారు.


More Telugu News