ప్రధాని మోదీని చంపగలను.. దూషించగలను: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు
- 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా తన పేరున ఒక్క స్కూలు కూడా లేదన్న నానా పటోలే
- మోదీ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- తీవ్రంగా స్పందించిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల నేపథ్యంలో తన నియోజకవర్గమైన భండారా జిల్లాలోని లఖానీ తెహసీల్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని తాను చంపగలనని, దూషించగలనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఒక్క స్కూలు కూడా తన పేరున లేదన్నారు. తాను ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నానని, తాను మోదీని చంపగలనని, అలాగే దూషించగలనని కూడా చెప్పుకొచ్చారు. అందుకనే మోదీ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాయతీ కలిగిన నాయకత్వం మీ ఎదుట నిలబడి ఉందని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.
పటోలే వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాన్ని ఎత్తిచూపారు. మోదీ కాన్వాయ్ 20 నిమిషాలపాటు రోడ్డుపై ఆగిపోయిందన్నారు. అయినప్పటికీ పంజాబ్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మోదీని చంపగలనని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.