కేసులు పెరిగితే చూద్దామని చెప్పడం విద్యాశాఖ మంత్రి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం: నాదెండ్ల మనోహర్
- దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
- పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల మూసివేత
- విద్యార్థులకు సెలవుల పొడిగింపు
- ఏపీలోనూ సెలవులు పొడిగించాలన్న నాదెండ్ల
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి స్వైరవిహారం చేస్తున్న తరుణంలో అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాయి. అయితే ఏపీలో మాత్రం పాఠశాలలు తెరవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.
కరోనా థర్డ్ వేవ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రికి దూరదృష్టి లోపించిందని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకు మూసివేస్తేనే విద్యార్థులను కరోనా బారి నుంచి కాపాడుకోగలమని హితవు పలికారు. కేసులు పెరిగితే చూద్దామని చెప్పడం విద్యాశాఖ మంత్రి బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేసి ఆన్ లైన్ విధానంలో తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయని వివరించారు. కానీ, ఏపీ సర్కారు విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు.