కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా
- హైదరాబాదులో ఫార్ములా-రేసింగ్
- విద్యుత్ కార్లతో రేసింగ్
- ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ సర్కారు
- కేటీఆర్ సమక్షంలో సంతకాలు
హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా-ఈ, గ్రీన్ కో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చింది. ఎలక్ట్రిక్ కార్లతో ఈ రేస్ నిర్వహిస్తారు. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.
ఫార్ములా ఈ చాంపియన్ షిప్ వ్యవస్థాపక జట్లలో మహీంద్రా రేసింగ్ టీమ్ కూడా ఉందని వెల్లడించారు. ఇన్నాళ్లకు తమ జట్టు సొంతగడ్డపై, దేశ ప్రజల ముందు కార్లను పరుగులు తీయించనుందని ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కల సాకారం కావడానికి కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాదులో ఈ-రేసింగ్ ప్రారంభం కోసం తహతహలాడుతున్నామని ఆనంద్ మహీంద్రా వివరించారు.