రష్మిక చేతుల మీదుగా రేపు 'స్టాండప్ రాహుల్' సాంగ్!

  • రాజ్ తరుణ్ నుంచి మరో సినిమా
  • కథానాయికగా వర్ష బొల్లమ్మ
  • సంగీత దర్శకుడిగా శ్వీకర్ అగస్తి
  • కీలకమైన పాత్రలో ఇంద్రజ  
రాజ్ తరుణ్ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన సినిమాలేవీ ఆశించిన స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఇటీవల అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన 'అనుభవించు రాజా' సినిమా కూడా ఫరవాలేదనిపించుకుంది అంతే. తప్పకుండా హిట్ కొడుతుందని అనుకున్న ఈ సినిమా కూడా అందుకు దూరంగానే ఉండిపోయింది.

ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'స్టాండప్ రాహుల్' రానుంది. నందకుమార్ - భరత్ నిర్మించిన ఈ సినిమాకి మోహన్ వీరంకి దర్శకత్వం వహించాడు. శ్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, రష్మిక చేతుల మీదుగా రేపు సాయంత్రం 4:59 నిమిషాలకు ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, సాంగ్ ప్రోమోను వదిలారు. రాజ్ తరుణ్ సరసన నాయికగా వర్ష బొల్లమ్మ నటిస్తున్న ఈ సినిమాలో, ఇంద్రజ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ముఖ్యమైన పాత్రల్లో మురళీశర్మ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


More Telugu News