బీసీలంటే దొర దృష్టిలో మీటింగులకు జనాలను తెచ్చేవారు: షర్మిల

  • బీసీలపై కేసీఆర్ కు ప్రేమ లేదు
  • సంఘాల పేరుతో విడదీయడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదు
  • బీసీ బిడ్డలకు ఫీజులు కట్టేందుకు డబ్బులు ఉండవంటూ విమర్శలు  
బీసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి ప్రేమ లేదని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బీసీలంటే దొర దృష్టిలో ఆయన మీటింగులకు జనాలను తెచ్చేవారని విమర్శించారు. గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అవసరం లేదని అన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే దొరకు... బీసీలకు లోన్లు ఇవ్వడానికి మాత్రం పైసలు ఉండవని దుయ్యబట్టారు.

బీసీ బిడ్డలకు ఫీజులు కట్టేందుకు డబ్బులు ఉండవని అన్నారు. ఆత్మగౌరవ భవనాలు అంటూ ముగ్గుపోసి వదిలేశారని విమర్శించారు. బీసీలను మురిపించి వాడుకోవడం, సంఘాల పేరుతో విడదీయడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లను కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. బీసీల కనీస అవసరాలు కూడా తీర్చలేని ముఖ్యమంత్రి మనకు వద్దని చెప్పారు.


More Telugu News