‘కరోనా గురించి నేను తెలుసుకున్న వాస్తవాలు ఇవీ..’ ప్రఖ్యాత అమెరికా వైద్యుడి స్వీయ అనుభవాలు

  • మాస్క్ తో కచ్చితంగా రక్షణ ఉంటుంది
  • టీకాలు కూడా తీసుకోవాలి
  • అప్పుడు వైరస్ వచ్చినా ఏమీ చేయలేదు
  • ట్విట్టర్ లో పోస్ట్
అమెరికాకు చెందిన ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ ఫహీమ్ యూనస్ ఇటీవలే కరోనా ఒమిక్రాన్ బారిన పడి కోలుకోగా.. తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. తనకు కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించి.. పూర్తి వివరాలను తెలియజేశారు.

మాస్క్ లతో నిజంగానే రక్షణ

‘‘మాస్కులతో కచ్చితంగా రక్షణ ఉంటుంది. గత రెండేళ్లలో కరోనా రోగుల మధ్య నేను వెయ్యి సార్లకు పైగా గడిపాను. కానీ కరోనా వైరస్ బారిన పడలేదు. కారణం మాస్క్, పీపీఈ కిట్లు కాపాడాయి. కానీ, కుటుంబ కార్యక్రమంలో మాస్క్ లేకుండా రెండు రోజులు గడిపాను. అంతే.. కరోనా బారిన పడ్డాను. కనుక ఎన్95 లేదా కేఎన్95 మాస్క్ లు ధరించండి

టీకాలతో మరింత రక్షణ

కరోనా టీకా, బూస్టర్ డోస్ కచ్చితంగా ఫలితం చూపించింది. దీంతో ఐదు రోజుల్లోనే తిరిగి పనిచేసుకునేందుకు వీలు ఏర్పడింది. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, పాక్స్ లోవిడ్, ఐవర్ మెక్టిన్, జింక్.. ఇలాంటి మందులు ఏవీ తీసుకోలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఉంటే చికిత్స ప్రోటోకాల్ మరో విధంగా ఉంటుంది.

తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్95 మాస్క్ ధరించి, బూస్టర్ టీకా తీసుకోండి. అప్పటికీ వైరస్ బారిన పడ్డా పూర్తిగా కోలుకుంటారు’’ అంటూ ట్విట్టర్ లో డాక్టర్ యూనస్ పోస్ట్ పెట్టారు.


More Telugu News