3 రోజుల్లోనే రూ.53 కోట్ల కలెక్షన్లు రాబట్టి దూసుకెళుతోన్న బంగార్రాజు
- అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు'
- రూ.100 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరుతుందంటోన్న విశ్లేషకులు
- ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ ఆకర్షిస్తోన్న సినిమా
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో రూ.53 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే దీని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించిన ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు జనం పోటెత్తుతున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో పాటు కుటుంబంతో కలిసి వెళ్లి చూసే విధంగా ఈ సినిమాను రూపొందించడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ బంగార్రాజు కోసం థియేటర్లకు వెళ్తున్నారు.
ఇక, వస్తోన్న కలెక్షన్లతో ఈ సినిమా యూనిట్ సంబరాల్లో మునిగింది. ఈ సినిమా రాబట్టిన వసూళ్లకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. కరోనా విజృంభణ సమయంలోనూ ఈ సినిమాకు భారీ స్పందన వస్తుండడం గమనార్హం. సంక్రాంతికి ఇతర పెద్ద సినిమాలు ఏవీ బరిలో లేకపోవడం బంగార్రాజుకు కలిసి వచ్చింది.
నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా సునాయాసంగా చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ కావడంతో అటువంటి కథతోనే మరోసారి కల్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు.