అర్ధనగ్న ఫొటోలను పోస్ట్ చేసే అర్చనకు టికెట్ ఇస్తారా?: కాంగ్రెస్ పై బీజేపీ, హిందూ మహాసభ ఫైర్
- బికినీ గర్ల్ అర్చనా గౌతమ్ కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
- చౌకబారు ప్రచారం కోసం టికెట్ ఇచ్చారన్న బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి
- హస్తినాపూర్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న హిందూ మహాసభ అధ్యక్షుడు
'బికినీ గర్ల్'గా పేరుగాంచిన మోడల్, నటి అర్చనా గౌతమ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై బీజేపీ, భారత హిందూ మహాసభ మండిపడుతున్నాయి. గతంలో మిస్ బికినీగా అర్చన గెలుపొందారు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి స్పందిస్తూ చౌకబారు ప్రచారాల కోసమే అర్చన లాంటి మహిళకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఆమెకు టికెట్ ఇవ్వడం వెనుక ప్రజాసేవ వంటి భావన లేదని చెప్పారు.
మరోవైపు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన హస్తినాపూర్ లో అర్చన వంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఇవ్వడం వల్ల ఈ పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బతిన్నదని... ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏదీ ఆశించలేమని ఎద్దేవా చేశారు. అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసే అర్చనకు టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు.
ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందించింది. రాజకీయాల్లోకి రావాలని ఒక కళాకారిణి కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. బీజేపీలో కూడా ఎంతో మంది నటులు, కళాకారులు ఉన్నారని చెప్పింది. ఒక నటి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని వ్యాఖ్యానించింది.