దేశంలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్ ఇవిగో
- నిన్న 2,58,089 కొవిడ్ కేసులు
- 385 మంది మృతి
- 16,56,341 యాక్టివ్ కేసులు
- రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న 2,58,089 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిలెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న 385 మంది మరణించారని వివరించింది. నిన్న కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారని పేర్కొంది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 16,56,341 మందికి చికిత్స అందుతోందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 70.37 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. నిన్న ఒక్కరోజే 13,13,444 పరీక్షలు చేసినట్లు కేంద్రం వివరించింది.