భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల

  • దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై ఏడాది
  • ‘స్వావలంబన భారత్‌’ సాధనలో కీలక పరిణామమన్న కేంద్ర మంత్రి
  • టీకా పంపిణీ యజ్ఞంలా సాగిందన్నమాండవీయ
కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న ఈ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

అనంతరం వీడియో లింక్ ద్వారా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో కరోనా టీకా పంపిణీ ఓ యజ్ఞంలా జరగడాన్ని చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలుకన్న ‘స్వావలంబన భారత్’ సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామమని అన్నారు.

కొవిడ్‌పై పరిశోధనలు, దేశీయంగా కరోనా టీకా అభివృద్ధిని మోదీ ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం సంయుక్తంగా కృషి చేయడం వల్లే 9 నెలల వ్యవధిలోనే దేశీయ కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందని మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.


More Telugu News