మడికట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదని కండిషన్ పెట్టా: బాలకృష్ణ
- ‘ఆహా’తో అదరగొడుతున్న బాలయ్య
- సంక్రాంతి షోకి వచ్చేసిన ‘లైగర్’ చిత్ర బృందం
- షో ఒప్పుకోవడానికి ముందు పెట్టిన కండిషన్‌ను బయటపెట్టిన బాలకృష్ణ
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోకు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. దేశంలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో ఇది నంబర్ వన్ స్థానంలో నిలిచి బాలయ్య క్రేజ్ ఏంటో నిరూపించింది.
తాజాగా, సంక్రాంతి సందర్భంగా ప్రసారమైన షోలో ‘లైగర్’ చిత్ర బృందం పాల్గొంది. దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు దేవరకొండ విజయ్, నిర్మాత చార్మి షోలో పాల్గొన్నారు. వారితో బాలయ్య సంభాషణ చాలా సరదాగా సాగింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. టాక్ షో అనగానే మడికట్టుకుని కూర్చోవడం తన వల్ల కాదని తొలుతే చెప్పేశానని అన్నారు. నేనేదో నాలుగు ప్రశ్నలు అడగడం, వారు తెలివిగా జవాబులు చెబితే అవి వినడం తన వల్ల కాదన్నానని, వచ్చిన వారిని ఆడేసుకుంటానని షరతు పెట్టానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా షోకి హాజరైన నటుడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి బాలకృష్ణ నటించిన మొదటి చిత్రం ఏది? అని ప్రశ్నించారు.
విజయ్ ఆలోచిస్తుండగా షోకి హాజరైన వారిలో ఒకరు ‘తాతమ్మకల’ అని సమాధానం ఇచ్చారు. స్పందించిన బాలకృష్ణ.. ‘వాడు నా చేతిలో అయిపోయాడు.. ఖతం’ అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ‘ఆహా’ ఈ వీడియోను విడుదల చేయగా సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. దీనిని మీరూ చూసేయండి మరి.