చిత్తూరు జిల్లా పశువుల పండుగలో విషాదం.. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేత
- మదనపల్లె మండలం వలసపల్లెలో ఘటన
- పొట్టేలుకు బదులుగా దానిని పట్టుకున్న వ్యక్తిపై వేటు
- అక్కడికక్కడే మృతి
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న ఆచారంలో భాగంగా గ్రామంలో పశువుల పండుగ నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో బలి కోసం సిద్ధం చేసిన పొట్టేలును సురేశ్ (35) అనే వ్యక్తి కదలకుండా పట్టుకోగా, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తలకు బదులుగా దానిని పట్టుకున్న సురేశ్ తలపై వేటేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.