తమిళనాడులో కరోనా ఉద్ధృతి... ఈ నెల 31 వరకు విద్యాసంస్థల మూసివేత
- తమిళనాడులో భారీగా కరోనా కేసులు
- నిన్న ఒక్కరోజులో 23 వేలకు పైగా కొత్త కేసులు
- ఇప్పటికే 1 నుంచి 9వ తరగతుల వారికి సెలవులు
- తాజాగా 10, 11, 12వ తరగతి విద్యార్థులకు సెలవులు
తమిళనాడులో కరోనా స్వైరవిహారం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 23,989 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా 10, 11, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఈ నెలాఖరు వరకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేసింది.
విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమిళనాడు విద్యాశాఖ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.
విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమిళనాడు విద్యాశాఖ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.