తనకు మూడోసారి కరోనా సోకిందన్న అంబటి రాంబాబు
- అంబటి రాంబాబుకు మరోసారి పాజిటివ్
- వీడియో ద్వారా వెల్లడి
- ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న అంబటి
- క్వారంటైన్ లో ఉన్నానని వివరణ
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మళ్లీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. ఇటీవల భోగి సందర్భంగా ప్రజలతో కలిసి ఆడిపాడారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
తనకు మళ్లీ కరోనా వచ్చిందన్న విషయాన్ని అంబటి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. మొదట 2020 జులైలో అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబరులో రెండోసారి కూడా కరోనా సోకింది.