కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయంపై గంగూలీ, సచిన్, రవిశాస్త్రి స్పందన
- కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తోంది: గంగూలీ
- భవిష్యత్తులోనూ కోహ్లీకి మంచి జరగాలి: సచిన్
- అత్యంత విచారకరమైన రోజు ఇది: రవిశాస్త్రి
టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తోందని, జట్టులో అతడు కీలక సభ్యుడని తెలిపారు. భవిష్యత్తులో టీమ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కోహ్లీ తన వంతు పాత్ర పోషిస్తాడనే భావిస్తున్నానని అన్నారు.
కెప్టెన్‌గా అద్భుతంగా రాణించిన కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నానని సచిన్ టెండూల్కర్ చెప్పారు. కోహ్లీ జట్టు కోసం వందశాతం కృషి చేశాడని అన్నారు. భవిష్యత్తులోనూ కోహ్లీకి మంచి జరగాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. సారథిగా కోహ్లీ సాధించిన దానికి అతడు తల ఎత్తుకుని వెళ్లవచ్చని రవిశాస్త్రి అన్నారు. కోహ్లీ బాగా దూకుడు కనబర్చుతూ చేసిన కెప్టెన్సీలో టీమిండియా విజయవంతమైందని ఆయన చెప్పారు. అయితే, కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వ్యక్తిగతంగా తనకు అత్యంత విచారకరమైన రోజని రవిశాస్త్రి తెలిపారు.
సారథిగా కోహ్లీ బాధ్యతలు చేపట్టిన అనంతరం విదేశాల్లో మనకు గొప్ప విజయాలు దక్కాయని వసీం జాఫర్ అన్నారు. అయితే, తాజాగా దక్షిణాఫ్రికా మీద సిరీస్ కోల్పోయినందుకు బాధగా ఉందని, అయినప్పటికీ భారత టెస్టు క్రికెట్ కోసం కోహ్లీ ఎంతో చేశాడని ఆయన చెప్పారు. ఇప్పటికే టీ20, వన్డేలకు కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకి ఆయన స్వయంగా రాజీనామా చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.