చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుదల తేదీ ఖరారు.. కొత్త పోస్టర్ విడుదల
- ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉన్న సినిమా
- వాయిదా వేస్తున్నట్లు నిన్న ప్రకటన
- ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు నేడు స్పష్టం
- ఉగాది సందర్భంగా విడుదల
కరోనా విజృంభణ నేపథ్యంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ సినిమా యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఉగాది పండుగ వేళ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వివరించింది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పలు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ దేశంలో కరోనా విజృంభణ కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పలు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది. సంక్రాంతి ముందు ఆ సినిమాలను విడుదల చేయాలనుకున్నారు. అయితే, ఇదే సమయంలో కరోనా విజృంభిస్తుండడం, పలు రాష్ట్రాల్లో థియేటర్లలో ఆంక్షలు పెట్టడంతో ఆయా సినిమాల విడుదలను వాయిదా వేశారు. మళ్లీ కరోనా విజృంభణ తగ్గాక ఈ సినిమాలను విడుదల చేసే అవకాశం ఉంది.