టెస్ట్ జట్టు కెప్టెన్ గా అతడు సరైనోడు: సునీల్ గవాస్కర్

  • వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు సూచన
  • చక్కగా రాణిస్తాడనే ఆశాభావం
  • మన్సూర్ అలీఖాన్ ప్రస్తావన
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేయడంతో తదుపరి ఈ బధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడం.. దాన్ని సాకుగా చూపించి వన్డే జట్టు సారథిగాను కోహ్లీని బీసీసీఐ తప్పించేసి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించడం తెలిసిందే. దీంతో కోహ్లీ కేవలం టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా మిగిలిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో విరాట్ కోహ్లీ మిగిలిన నాయకత్వ బాధ్యతలకు కూడా సెలవు చెప్పేశాడు.

దీంతో మాజీ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (24) సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డారు. పంత్ అయితే జట్టును సమర్థవంతంగా నడిపించగలడన్నారు. భారత జట్టు కెప్టెన్ బాధ్యతలను మన్సూర్ అలీ ఖాన్ పటౌడి చిన్న వయసులోనే చేపట్టి రాణించిన విషయాన్ని ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేశారు.


More Telugu News