ఇది మనం కలిసి నిర్మించిన జట్టు... బాధగా ఉంది కోహ్లీ: రవిశాస్త్రి
- టీమిండియా టెస్టు కెప్టెన్ గా కోహ్లీ రాజీనామా
- గర్వించదగ్గ కెరీర్ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యలు
- అత్యంత విజయవంతమైన కెప్టెన్ అంటూ కితాబు
టీమిండియా టెస్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. "విరాట్... టెస్టు కెప్టెన్ గా నీ ప్రస్థానం పట్ల నువ్వు తలెత్తుకుని సగర్వంగా చెప్పుకోవచ్చు. భారత క్రికెట్ లో అత్యంత దూకుడైన నాయకుడివి, విజయవంతమైన నాయకుడివి నువ్వే. అయితే కెప్టెన్ గా నువ్వు వైదొలిగిన నేపథ్యంలో వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధ కలిగించే రోజు. ఎందుకంటే ఈ జట్టును మనిద్దరం కలిసి నిర్మించాం" అని వివరించారు. కోహ్లీ, రవిశాస్త్రి కాంబినేషన్ లో టీమిండియా అనేక అద్భుత విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పింది.