ఆసక్తిని రేపుతోన్న 'ఫ్లాష్ బ్యాక్' .. గ్లామరస్ పాత్రలో అనసూయ!
- ప్రభుదేవా హీరోగా 'ఫ్లాష్ బ్యాక్'
- కథానాయికగా రెజీనా
- కీలకమైన పాత్రలో అనసూయ
- తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్
కొంతకాలం క్రితం వరకూ దర్శకుడిగా వరుసగా బాలీవుడ్ సినిమాలను చేసిన ప్రభుదేవా, ఇటీవల కాలంలో నటనపైనే మళ్లీ శ్రద్ధ పెంచినట్టుగా కనిపిస్తోంది. హీరోగా ఇతర దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నాడు. అలా ఆయన అంగీకరించిన సినిమాలలో ఒకటిగా 'ఫ్లాష్ బ్యాక్' కనిపిస్తోంది.
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే టైటిల్ తో తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. డిఫరెంట్ లుక్ తో ప్రభుదేవా కనిపించనున్న ఈ సినిమాకి డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రెజీనా .. అనసూయ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో రెజీనా ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అనసూయ మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. 'పుష్ప'లో అనసూయను గ్లామరస్ గా చూద్దామని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ఈ సినిమా ఆ ముచ్చట తీర్చనుందన్న మాట. .
విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే టైటిల్ తో తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. డిఫరెంట్ లుక్ తో ప్రభుదేవా కనిపించనున్న ఈ సినిమాకి డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రెజీనా .. అనసూయ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో రెజీనా ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అనసూయ మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. 'పుష్ప'లో అనసూయను గ్లామరస్ గా చూద్దామని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ఈ సినిమా ఆ ముచ్చట తీర్చనుందన్న మాట.