ఏపీలో ఒక్కరోజులో 4,955 కరోనా కేసులు... తాజా వివరాలు ఇవిగో!
- ఏపీలో కరోనా కేసులు తీవ్రతరం
- గత 24 గంటల్లో 35,673 కరోనా పరీక్షలు
- విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరి మృతి
- ఇంకా 22,870 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ అధికమైంది. గడచిన 24 గంటల్లో 35,673 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 397 మంది కరోనా నుంచి కోలుకోగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,64,331 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,64,331 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.