యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
- యూపీలో ఎన్నికల సందడి
- ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
- మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు
- తొలి రెండు విడతల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత పెరిగింది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది. 1, 2వ విడతల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని కూడా నేడు ప్రకటించారు. ఆయన ఈ పర్యాయం గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ అర్బన్ స్థానానికి ఆరో దశలో ఎన్నిక (మార్చి 3) జరగనుంది.