దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న టీమిండియా

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్న టీమిండియా
  • టెస్టు సిరీస్ ఓడిపోయిన టీమిండియా
  • ఈ నెల 19 నుంచి వన్డే సిరీస్
  • సఫారీలతో మూడు వన్డేలు ఆడనున్న భారత్
  • రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్ గా కేఎల్ రాహుల్
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ లో పరాభవం చవిచూసిన టీమిండియా ఇక వన్డే సిరీస్ పై దృష్టి సారించింది. 1-2తో టెస్టు సిరీస్ ను టీమిండియా కోల్పోయినప్పటికీ, కొన్ని సెషన్లలో స్ఫూర్తిదాయకమైన పోరు కనబర్చింది. ఇక ఆ పరాజయాన్ని మర్చిపోయి మూడు వన్డేల సిరీస్ లో సత్తా చాటాలని భారత ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇన్నాళ్లు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ సాధారణ ఆటగాడిలా ఈ సిరీస్ లో పాల్గొంటున్నాడు.

టీమిండియా సభ్యులు వీరే...
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా (వైఎస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ, జయంత్ యాదవ్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ.


More Telugu News