ఆర్సీబీ.. సీఎస్కే ఐపీఎల్ జట్లకు క్రేజ్ మామూలుగా లేదు.. ప్రపంచ టాప్ 10 జట్లలో వీటికి స్థానం
- సోషల్ మీడియాలో ఎక్కువ ఎంగేజ్ మెంట్లు
- ఆర్సీబీ 8వ స్థానంలో
- 9వ స్థానంలో సీఎస్కే
- 2021 గణాంకాల్లో చోటు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ జట్లకు అభిమానులు ఎక్కువ. దేశీయంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు జట్లను సామాజిక మాధ్యమాల్లో భారీగా అభిమానులు ఫాలో అవుతుంటారు. ఆటలో ప్రొఫెషనలిజం, ఈ జట్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మేటి ఆటగాళ్లు ఉండడం కూడా కారణాల్లో కొన్ని అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ జట్లు గొప్ప గుర్తింపును సొంతం చేసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టాప్ -10 స్పోర్ట్స్ క్లబ్ లలో ఆర్సీబీ, సీఎస్కే చోటు దక్కించుకున్నాయి. సామాజిక మాధ్యమాలలో అభిమానులు ఎక్కువగా ఫాలో అయ్యే జట్లలో ఈ రెండూ ఉన్నాయి. ఫుట్ బాల్ క్లబ్ లను వెనక్కి నెట్టేసిన ఘనత ఈ ఐపీఎల్ జట్లకే దక్కింది.
ఆర్సీబీ 820 మిలియన్ ల ఎంగేజ్ మెంట్లతో 8వ స్థానంలో ఉంటే.. సీఎస్కే 752 మిలియన్ ల ఎంగేజ్ మెంట్లతో 9వ స్థానంలో ఉంది. వీటి ముందు ఏడు స్థానాలలో మొదటి నుంచి చూస్తే వరుసగా మాంచెస్టర్ యునైటెడ్, ఎఫ్సీ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, ప్యారిస్ సెయింట్ జెర్మన్, చెల్సియా ఎఫ్ సీ, లివర్ పూల్ ఎఫ్ సీ, గలాటాసరే ఉన్నాయి. ఎంగేజ్ మెంట్ అంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో యూజర్ చర్యలుగా చూడాలి. లైక్ చేసినా, షేర్ చేసినా, రిప్లయ్ ఇచ్చినా ఇలా ప్రతీ ఒక్క చర్య ఒక ఎంగేజ్ మెంట్ అవుతుంది.
2021 ఏప్రిల్ లో ఐపీఎల్ మొదటి దశలో ఆర్సీబీ 265 మిలియన్ ల ఎంగేజ్ మెంట్లను సంపాదించుకుంది. అదే సమయంలో సీఎస్కేకు వచ్చిన ఎంగేజ్ మెంట్లు 205 మిలియన్లు. 'మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్' ఈ వివరాలను ప్రకటించింది.