ప్రజలకు ప్రముఖుల సంక్రాంతి శుభాకాంక్షలు
- కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలనే సందేశాన్నిస్తుంది: వెంకయ్య నాయుడు
- కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలి: కేసీఆర్
- ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి: జగన్
ప్రజలకు పలువురు ప్రముఖులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 'సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దలను గౌరవించి, కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సానుకూల మార్పులకు సంకేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
'ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
'తెలంగాణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పుణ్యకాలంలో ప్రజలు సిరి సంపదలతో తులతూగాలి. ప్రజలు పచ్చదనం మధ్య పండుగ జరుపుకోవాలి. కరోనా నిబంధనలు పాటించాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
'రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను. గ్రామ గ్రామంలో సందడి తెచ్చే తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమే. దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం సంక్రాంతికి తమ పల్లెకు చేరి పండుగ చేసుకుంటారు. అందరికీ ఈ పండుగ సిరులు తీసుకురావాలని కోరుకుంటూ... సంక్రాంతి శుభాకాంక్షలు' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
'సంక్రాంతి అంటేనే సందడి. భోగ భాగ్యాల సంక్రాంతి అందరి ఇంట సిరుల పంట పండించాలని, ఈ సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అని ఏపీ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు.