సంక్రాంతి సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు

  • ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
  • కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు
  • మచిలీపట్నం, తిరుపతి, సికింద్రాబాద్ మధ్య
  • నర్సాపూర్-వికారాబాద్ మార్గంలో రైళ్లు
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా ఒమిక్రాన్ వైరస్ బాగా వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ముఖ్యమైన పండుగ కావడంతో ప్రజలు ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా గడిచిన రెండు రోజులుగా రైళ్లు, బస్సులు రద్దీగా మారాయి. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎన్నో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపిస్తోంది. తాజాగా మరిన్ని ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది.

నర్సాపూర్ నుంచి వికారాబాద్ కు రైలు సర్వీసు 16, 18వ తేదీల్లో రాత్రి 8.50 గంటలకు ఉంటుంది. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు 16, 18వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రైలు సర్వీసు ఉంటుంది. అలాగే, నర్సాపూర్ - వికారాబాద్ మధ్య 17వ తేదీ ఉదయం 10 గంటలకు జన్ సాధారణ రైలు, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు 16 రాత్రి 7 గంటలకు రైలు సర్వీస్ ను ఏర్పాటు చేసింది.

తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు 17వ తేదీ రాత్రి 8.15 గంటలకు, కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు 17న రాత్రి 9 గంటలకు రైలు సర్వీసులు ఉంటాయి. అలాగే, మచిలీపట్నం - సికింద్రాబాద్ మార్గంలో 17, 19వ తేదీల్లో రాత్రి 8.50కు రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.


More Telugu News