చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు జైలులో రైతు: చంద్రబాబు మండిపాటు
- రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి
- వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
- పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభ
- మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సంక్రాంతి పండుగ రోజు కూడా రైతులను క్షోభకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతును జైలులో పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు.
'గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి' అన్నారు చంద్రబాబు
'పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించింది. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.
తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలి... వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలి' అని ఆయన డిమాండ్ చేశారు.