నైజామ్ లో 'బంగార్రాజు' తొలిరోజు వసూళ్లు!
- నిన్న రిలీజైన 'బంగార్రాజు'
- పండగ సందర్భానికి కనెక్ట్ అయిన కథ
- నైజామ్ లో తొలి రోజున 3.1 కోట్ల గ్రాస్
- మంచి ఓపెనింగ్సే అంటున్న ట్రేడ్ వర్గాలు
గతంలో సంక్రాంతి బరిలో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను దింపి, అత్యధిక వసూళ్లను రాబట్టిన నాగార్జున.. ఈ ఏడాది కూడా 'బంగార్రాజు' చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి వదిలారు. నిన్ననే ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు.
గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడం .. పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడం వలన 'బంగార్రాజు'కి అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. నైజామ్ లో తొలి రోజున 3.1 కోట్ల గ్రాస్ ను .. 1.73 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మంచి ఓపెనింగ్సే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రొమాంటిక్ హీరోగా నాగార్జునకి ఉన్న క్రేజ్ .. రమ్యకృష్ణకి గల ఇమేజ్ .. చైతూ తొలిసారిగా ట్రైచేసిన డిఫరెంట్ రోల్ .. కృతిశెట్టి గ్లామర్ .. అనూప్ సంగీతం .. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన టాక్ కారణంగా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.