ఈ వీడియోను ఇప్పటివరకు 1000 కోట్ల సార్లు చూశారు... ఇంతకీ వీడియోలో ఏముందంటే...?

  • యూట్యూబ్ రారాజుగా బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో
  • వీడియోను పోస్టు చేసిన పింక్ ఫాంగ్ చానల్
  • ఈ వీడియోకు 3.2 కోట్ల లైకులు
  • చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న వీడియో
ఓ వీడియో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధిస్తే గొప్ప విషయంగానే భావించాలి. అదే పది మిలియన్ల వ్యూస్ (కోటి) సాధిస్తే ఇంకాస్త గొప్ప అనుకోవాలి. అలాంటిది ఓ వీడియో 1000 కోట్ల వ్యూస్ సాధిస్తే దాన్నేమనాలి? అంతకంటే ముందు, అసలు ఆ వీడియోలో ఏముందన్న ఆసక్తి కలుగుతుంది.

అదొక పిల్లల మ్యూజిక్ వీడియో. 'బేబీ షార్క్ డ్యాన్స్' అనే ఆ వీడియోలో కొందరు చిన్నారులు, పలు యానిమేషన్ బొమ్మలు హుషారైన పెర్ఫార్మెన్స్ తో అలరించడం చూడొచ్చు. ఈ వీడియో నిడివి 2 నిమిషాలకు పైనే ఉంటుంది. 'పింక్ ఫాంగ్' అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేసిన ఈ 'బేబీ షార్క్ డ్యాన్స్' వీడియోను ఇప్పటివరకు 1000,89,32,715 సార్లు చూశారు.

ఈ వీడియోకు 3.2 కోట్ల లైకులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో ఈ పాటకు విశేషమైన క్రేజ్ ఉంది. ఇందులో పెద్దగా సాహిత్యం లేకపోయినా, పాట ఎంతో లయబద్ధంగా సాగుతుంది.


More Telugu News