సమరసింహారెడ్డి సినిమాలో నటించే చాన్స్ వదులుకున్న రాశి... అసలు కారణం ఇదేనట!

  • 1999లో వచ్చిన సమరసింహారెడ్డి
  • బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్
  • రూ.16 కోట్ల మేర వసూళ్లు
  • ఓ సీన్ పై రాశి అభ్యంతరం
  • సిమ్రాన్ వైపు మొగ్గుచూసిన చిత్రబృందం
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోతుంది. 1999 సంక్రాంతి సీజన్ లో వచ్చి దుమ్ముదులిపేసింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది.

ఈ చిత్రంలో సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. కాగా, సిమ్రాన్ నటించిన పాత్రకు తొలుత రాశిని అనుకున్నారట. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్ తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సిమ్రాన్ వైపు మొగ్గారట.


More Telugu News