'వైసీపీ రాజ్యసభ టికెట్' అంటూ జరుగుతున్న ప్రచారంపై చిరంజీవి స్పందన
- ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ
- రాజ్యసభకు పంపుతున్నారంటూ ప్రచారం
- తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానన్న చిరంజీవి
- ఇది కేవలం ప్రచారమేనని వ్యాఖ్య
నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అయితే, చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
దీనిపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని స్పష్టం చేశారు. తనకు రాజ్యసభ టికెట్ అనేది కేవలం ప్రచారమేనని వెల్లడించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
కాగా, చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది.