ఢిల్లీలో బాంబు కలకలం... తప్పిన పెనుప్రమాదం

  • ఘాజీపూర్ పూల మార్కెట్ లో బ్యాగు
  • బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తింపు
  • బ్యాగును నిర్జన ప్రదేశానికి తరలించిన ఎన్ఎస్ జీ
  • పేల్చివేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఇక్కడి ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్ లో అణువణువు తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగును గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు, ఎన్ఎస్ జీకి సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు.

హుటాహుటీన మార్కెట్ వద్దకు చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఎన్ఎస్ జీ బలగాలు ఆ బ్యాగులోని బాంబును నిర్జన ప్రదేశానికి తరలించి అక్కడ పేల్చివేశాయి. సకాలంలో బాంబును గుర్తించడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. దీనిపై ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం కేసు నమోదు చేసింది. బాంబు ఎవరు పెట్టారన్న దానిపై దర్యాప్తు షురూ చేసింది.


More Telugu News