బ్యాటింగ్ చేస్తుండగా ఎగిరిపోయిన రిషభ్ పంత్ బ్యాట్.. వీడియో వైరల్
- టెస్టు మ్యాచులో అద్భుతంగా ఆడిన పంత్
- ఒలివర్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బౌండరీకి బంతిని బాదిన పంత్
- ఆ సమయంలోనే బ్యాటు చేతి నుంచి జారిన వైనం
- లెగ్ సైడ్ 30 అడుగుల సర్కిల్ దగ్గర పడిపోయిన బ్యాట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ బాగా రాణించిన విషయం తెలిసిందే. అయితే, నిన్న తను బౌండరీ కొట్టే సమయంలో బ్యాటు గాల్లోకి ఎగిరింది. ఆ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమైన సమయంలో క్రీజులో నిలదొక్కుకున్న పంత్ రెండో ఇన్నింగ్స్ లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఒలివర్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బౌండరీకి బంతిని కొట్టాడు. ఆ సమయంలోనే బ్యాటు చేతి నుంచి జారి లెగ్ సైడ్ 30 అడుగుల సర్కిల్ దగ్గర పడిపోయింది. మైదానంలో ఇతర ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. పంత్ కూడా నవ్వుతూ వెళ్లి తన బ్యాటును తెచ్చుకున్నాడు. అతడు కొట్టిన బాల్ బౌండరీ దాటింది.
ఈ ఇన్సింగ్స్‌లో పంత్ 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా అతడికి సహకారం అందించి మరింత రాణించి ఉంటే జట్టు స్కోరు భారీగా నమోదయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్ బ్యాటింగ్ చేస్తుండగా బ్యాట్ ఎగిరిపోయిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఆ బ్యాట్ వెళ్లి ఎవరికైనా తగిలితే ఆ బాధిత వ్యక్తి కూడా బౌండరీ అవతల పడేవాడని ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఓ స్టీల్ కంపెనీ యాడ్ లో బంతిని బలంగా కొట్టే క్రమంలో పంత్ చేతి నుంచి బ్యాటు జారి దూరంగా పడుతుంది. ఇప్పుడు అటువంటి ఘటనే మ్యాచులో చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై కూడా నెటిజన్లు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు.