'విరుమాన్' నుంచి కార్తి ఫస్టులుక్!

  • సూర్య బ్యానర్లో 'విరుమాన్'
  • మాస్ కంటెంట్ తో సాగే కథ
  • యాక్షన్ తో పాటు ఎమోషన్ కి ప్రాధాన్యత  
  • కార్తి జోడీగా అదితి శంకర్
మొదటి నుంచి కూడా కార్తి విభిన్నమైన కథల పట్ల .. విలక్షణమైన పాత్రల పట్ల ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. తెరపై ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతుంటాడు. 'ఖాకీ' .. 'ఖైదీ' సినిమాలు ఆయన నటనకు కొలమానంగా నిలుస్తాయి. కొత్తదనానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడనడానికి నిదర్శనంగా కనిపిస్తాయి.

ఆయన తాజా చిత్రంగా 'విరుమాన్' రూపొందుతోంది. సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తి పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. లుంగీ పైకి కట్టి .. బల్లెం వంటి ఆయుధాన్ని ధరించి .. అన్నిటికీ తెగించినవాడిలా ఒక రాళ్లగుట్టపై కూర్చుని ఆయన కనిపిస్తున్నాడు.

ఆయన లుక్ చూస్తుంటేనే ఈ సినిమాలో యాక్షన్ తో కూడిన ఎమోషన్ పాళ్లు ఎక్కువేననే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాతో కథానాయికగా అదితి శంకర్ పరిచయమవుతోంది. డైరెక్టర్ శంకర్ కూతురే ఈ అమ్మాయి. ఈ సినిమాతోనే ఆమె తమిళ తెరకి పరిచయమవుతోంది. మరో సినిమాను శింబు జోడీగా చేస్తోంది..


More Telugu News