తిరుపతి ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేత అంశంపై చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి సింథియా
- విమానాశ్రయానికి నీటిని నిలిపివేయడం దిగ్భ్రాంతికరమన్న జీవీఎల్
- ఓ పత్రికా కథనం ఆధారంగా కేంద్రానికి లేఖ
- లేఖపై స్పందించిన కేంద్రమంత్రి సింథియా
- పరిశీలన జరుపుతామని వెల్లడి
తిరుపతి రేణిగుంట విమానాశ్రయంతో పాటు, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేశారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. జీవీఎల్ లేఖపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కేంద్రం తరఫున ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఇకపై ఎంతమాత్రం అసౌకర్యం కలగదని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
కాగా, ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జీవీఎల్ కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల బొత్స సత్యనారాయణ తిరుపతి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలే ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేతకు దారితీశాయంటూ ఆ పత్రికా కథనంలో పేర్కొన్నారు.