మాదాపూర్ లో కరెన్సీ నోట్లు అనుకుని ఎగబడ్డ జనం... తీరా చూస్తే...!
- రోడ్డుపై కరెన్సీ నోట్లు
- ట్రాఫిక్ కు అంతరాయం
- రంగప్రవేశం చేసిన పోలీసులు
హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన జరిగింది. కాకతీయ హిల్స్ ఏరియాలో రోడ్డుపై కరెన్సీ నోట్లు పడి ఉన్నాయన్న సమాచారం శరవేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు అక్కడికి పోటెత్తారు. దూరం నుంచి చూస్తే అవన్నీ 2 వేల రూపాయల నోట్లు లాగానే కనిపించాయి. దాంతో వాటిని తీసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. కానీ వాళ్ల ఆశ అడియాస కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
అవన్నీ పిచ్చి నోట్లు అని గుర్తించి తీవ్ర నిరాశకు గురయ్యారు. పాపం, వాహనాలపై వెళ్లే వాళ్లు కూడా ఆ నోట్ల కోసం రావడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అయితే, ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసులు... వెంటనే ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. జనాలను అక్కడినుంచి పంపించివేశారు. పోలీసులు ఆ నోట్లను పరిశీలించి అవి పిల్లలు ఆడుకునే పిచ్చి నోట్లు అని గుర్తించారు.