భాగ్యనగరంలో నియంత్రణల నడుమ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
- వైకుంఠ ద్వార దర్శనాలు బంద్
- సాధారణ దర్శనాలకే అనుమతి
- బిర్లా మందిరం మూసివేత
- చిలుకూరులో వైకుంఠ ద్వార దర్శనాలు
హైదరాబాద్ లోని ప్రముఖ ఆలయాలు నేడు ముక్కోటి ఏకాదశి ఉత్సవాల శోభను సంతరించుకున్నాయి. భక్తులతో సందడిగా మారాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు నియంత్రణలను విధించాయి.
టీటీడీ ఆధ్వర్యంలోని హిమాయత్ నగర్, జూబ్లిహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయాలు, చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి టెంపుల్, జియాగూడలోని రంగనాథస్వామి ఆలయం, ఆల్వాల్ లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం, మరికొన్ని ఇతర ఆలయాలు ఉత్తరద్వార దర్శనాలు చేపట్టడకూడదని నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సాధారణ దర్శనాలకే అనుమతిస్తున్నాయి.
బిర్లా మందిరాన్ని గురువారం మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. భక్తులను ఆలయానికి రావద్దని కోరింది. వెంకటేశ్వరస్వామికి సేవలను ఏకాంతంగా జరిపించనున్నట్టు బిర్లా మందిర్ ఈవో శ్యామ్ కొథారి తెలిపారు.
సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయం కూడా స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా సేవలు నిర్వహించాలని నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేయలేదని ఆలయ ఈవో కేపీ సత్యమూర్తి తెలిపారు. దేవాదాయ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతేడాది ముక్కోటి ఏకాదశి నాడు 1.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు చెప్పారు.
చిలుకూరులోని ప్రముఖ బాలాజీ ఆలయం వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తోంది. ‘‘ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, క్యూ లైన్లో భౌతిక దూరం పాటించి రావాలి’’ అని ప్రధాన అర్చకుడు సౌందర్ రంగరాజన్ సూచించారు.