నియంత్రణ రేఖ వెంబడి 350-400 మంది పాక్ ఉగ్రవాదులు: ఆర్మీ చీఫ్

  • ల్యాంచ్ ప్యాడ్ ల వద్ద సిద్ధం
  • అదే పనిగా చొరబాటు యత్నాలు
  • పాకిస్థాన్ దుర్మార్గపు ఉద్దేశాలకు నిదర్శనం
  • కఠినంగా వ్యవహరిస్తామన్న జనరల్ ఎంఎం నరవణె 
సరిహద్దులకు సమీపంలోని ల్యాంచ్ ప్యాడ్ లు, శిక్షణా కేంద్రాల వద్ద పాకిస్థాన్ 350 నుంచి 400 మంది ఉగ్రవాదులను సిద్ధంగా ఉంచిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె తెలిపారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నా, ఇలా చేయడం అంటే అది ఆ దేశ దుర్మార్గపు ఆలోచనలను తెలియజేస్తోందన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ఆయన చెప్పారు.

శరీరం గడ్డ కట్టుకుపోయే మైనస్ ఉష్ణోగ్రతలు ఉండే సియాచిన్ (హిమాలయాలు) నుంచి సైనికులను ఉపసంహరించుకోవడంపై ఎదురైన ఒక ప్రశ్నకు నరవణె స్పందించారు. సియాచిన్-సాల్టొరో రీజియన్ లో 110 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల్లోని దళాల వాస్తవిక స్థానాలను ముందుగా పాకిస్థాన్ ధ్రువీకరించాల్సి ఉందన్నారు. భారత్ ఉన్న ప్రాంతాన్ని, పాకిస్తాన్ సైనికులు ఉన్న ప్రాంతాలను పాకిస్థాన్ ఆమోదించాల్సి ఉందన్నారు. అప్పుడే అక్కడ నిస్సైనికీకరణ సాధ్యమని స్పష్టం చేశారు. ఇక్కడ భారత సైనికులే ఎక్కువగా పహారా కాస్తుంటారు.

నియంత్రణ రేఖ పొడవునా ఉగ్రవాదుల ల్యాంచ్ ప్యాడ్ లలో ఉగ్రవాదుల కదలికలు పెరిగినట్టు నరవణె చెప్పారు. అదే పనిగా చొరబాటుకు యత్నించడం పాకిస్థాన్ దుర్మార్గపు ఉద్దేశాలను తెలియజేస్తోందన్నారు.


More Telugu News