'ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీగా 'బంగార్రాజు'
- 'బంగార్రాజు'గా నాగార్జున
- మరో రొమాంటిక్ హీరోగా చైతూ
- సంక్రాంతి నేపథ్యానికి కనెక్ట్ చేసే కథ
- రేపు ప్రేక్షకుల ముందుకు
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' రూపొందింది. గతంలో నాగార్జున చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకి ఇది సీక్వెల్. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అందులో పోషించిన 'బంగార్రాజు' పాత్రనే టైటిల్ గా చేసుకుని నాగార్జున ఈ సంక్రాంతికి వస్తున్నాడు.
రమ్యకృష్ణ .. చైతూ .. కృతిశెట్టితో కలిసి ఆయన చేసిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్, హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతి బరి నుంచి 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' తప్పుకోవడంతో, 'బంగార్రాజు' పెద్ద సినిమాగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడం .. పండుగకి సంబంధించిన అంశాలు కలిగిన కథ కావడం ఈ సినిమాకి కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో చైతూలోని రొమాంటిక్ యాంగిల్ ని పరిచయం చేయాలనే నాగ్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి .
రమ్యకృష్ణ .. చైతూ .. కృతిశెట్టితో కలిసి ఆయన చేసిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్, హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతి బరి నుంచి 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' తప్పుకోవడంతో, 'బంగార్రాజు' పెద్ద సినిమాగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడం .. పండుగకి సంబంధించిన అంశాలు కలిగిన కథ కావడం ఈ సినిమాకి కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో చైతూలోని రొమాంటిక్ యాంగిల్ ని పరిచయం చేయాలనే నాగ్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి