దేశంలో భారీగా నమోదవుతోన్న కరోనా కేసులు.. కొత్తగా 2.47 లక్షల మందికి కొవిడ్
- మొన్నటి కన్నా నిన్న 27 శాతం కేసులు అధికం
- 11,17,531 యాక్టివ్ కేసులు
- రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతం
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొన్న దేశంలో 1,94,720 కొత్త కేసులు నమోదు కాగా, నిన్న మరింత భారీగా పెరిగి 2,47,417 కేసులు నమోదయ్యాయి. మొన్నటి కన్నా నిన్న 27 శాతం కేసులు అధికంగా వచ్చాయి. నిన్న కరోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు.
ఇక ప్రస్తుతం దేశంలో 11,17,531 మంది కరోనాకు హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు పెరిగింది. నిన్న కరోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.