అహోబిలం క్షేత్రంలో భక్తుడిపై చిరుత దాడి

  • ఎగువ అహోబిలంలో ఘటన
  • మెట్ల మార్గంలో కాపుకాసి దాడి
  • ప్రాణాలతో బయటపడిన భక్తుడు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో చిరుత కలకలం రేపింది. ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది. మెట్ల మార్గంలో కాపు కాసిన చిరుత ఒక్కసారిగా భక్తుడిపైకి దూకి దాడి చేసింది.

అయితే, ఈ ఘటన నుంచి బాధిత భక్తుడు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలిసిన భక్తులు మెట్లమార్గం గుండా వెళ్లేందుకు భయపడుతున్నారు. వారం రోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తోందని భక్తులు చెబుతున్నారు.


More Telugu News