ఆ కథను ముందుగా నితిన్ విన్నాడట!
- వరుస ఫ్లాపులతో నితిన్
- 'భీష్మ' తరువాత పడని హిట్
- ముందుగా 'హీరో' కథను విన్న నితిన్
- కొన్ని కారణాల వలన సెట్ కాని ప్రాజెక్టు
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. 'హీరో' సినిమాతో ఆయన ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా హీరో అవ్వాలని కలలుగనే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులో నుంచి ఆయన ఎలా బయటపడ్డాడనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.
అయితే శ్రీరామ్ ఆదిత్య ఈ కథను ముందుగా నితిన్ కి వినిపించాడట. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టును చేయలేకపోయాడు. అందువలన ఆ కథను అశోక్ గల్లాకి చెప్పి శ్రీరామ్ ఆదిత్య ఒప్పించినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది అలా ఉంచితే, అశోక్ మాత్రం ఈ కథపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇక నితిన్ విషయానికి వస్తే, కొంతకాలంగా ఆయన వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 'భీష్మ' తరువాత ఆయన సరైన హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం 'మాచర్ల నియోజక వర్గం' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఈ ఏడాది తొలి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి మరి.